దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 18 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 20 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 9 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 2 లక్షలకు చేరాయి.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 20,021 మంది కరోనా బారినపడ్డారు. తాజా కేసులతో ఇప్పటివరకు కరోనా బారినపడ్డవారి సంఖ్య 1,02,07,871కి చేరింది. ఇందులో 97,82,669 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 1,47,901 మంది మరణించారు.
మరో 2,77,301 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 279 మంది మరణించగా, కొత్తగా 21,131 మంది కోలుకున్నారని వెల్లడించింది.