మెల్‌బోర్న్‌లో భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తన తొలి ఇన్నింగ్స్‌లో 196 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. ఆరంభంలో అశ్విన్ తన స్పిన్‌తో అదరగొట్టగా.. ఆ తర్వాత బుమ్రా టెయిలెండర్లను త్వరత్వరగా ఇంటికి పంపించేశాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్ 30, లబుషనే 48, ట్రావెస్ హెడ్ 38, లయాన్ 20 రన్స్ చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే ఇండియా వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ ఎల్బిడబ్ల్యూ రూపంలో డకౌట్ అయ్యాడు.