ఫ్రాన్స్‌లో కొత్త రకం కరోనా కేసు నమోదు అయ్యింది. బ్రిటన్‌లో గుర్తించిన వేరియంట్ ఫ్రాన్స్‌లో కనిపించినట్లు అధికారులు ద్రువీకరించారు. టూర్స్ పట్టణంలోని తమ పౌరుడికే ఆ వైరస్ సోకినట్లు ఫ్రెంచ్ ఆరోగ్య శాఖ చెప్పింది.
డిసెంబర్ 19వ తేదీన అతను లండన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతనిలో లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం అతను ఇంటి వద్దే స్వీయ నియంత్రణలో ఉన్నారు.
ఇటీవల ఇంగ్లండ్‌లో కనిపించిన కొత్త రకం వైరస్ వల్ల పలు దేశాల్లో ట్రావెల్ ఆంక్షలు అమలు చేసిన విషయం తెలిసిందే. తొలుత ఫ్రాన్స్ దేశం తమ సరిహద్దుల్ని మూసివేసినా.. బుధవారం ఆ ఆంక్షలను ఎత్తివేసింది. ఇంగ్లీష్ ఛానల్‌ను దాటేందుకు కెంట్ వద్ద క్రిస్మస్ రోజున వేలాది మంది ట్రక్కు డ్రైవర్లు వేచి చూశారు.