ఛలో, గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కన్నడ భామ రష్మిక మందన్నా. కన్నడ, తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగు వెలుగుతున్న ఈ భామ ఇపుడు బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తోంది.
హిందీలో మొదటిసారే భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న మిషన్ మజ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది రష్మిక. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్‌రోల్ పోషిస్తున్నాడు.
ఈమూవీ పాకిస్థాన్ లో రా (భారత సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) చేపట్టిన అతిపెద్ద కోవర్ట్ ఆపరేషన్ లోని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోన్నీ స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమా మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాంతను బాగ్‌చి దర్శకత్వం వహిస్తన్నాడు.