మానవత్వం చాటుకున్న క్వాలిస్ డ్రైవర్ మల్లేశం
rameshbabu
December 24, 2020
SLIDER, TELANGANA
712 Views
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు హైవేపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. కొండగట్టు హై వే పైన ఉన్న మారుతీ టౌన్ షిప్ వద్ద ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఖానాపూర్ కు చెందిన మొగిలి అనే డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం కరీంనగర్ తరలించారు.
కాగా రాత్రి సమయంలో యాక్సిడెంట్ జరగడంతో ఎవరు అందుబాటులో లేక క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్న సమయంలో అదే రోడ్డు లో పుడూర్ నుండి జగిత్యాల వైపు వెళుతున్న పెంబట్ల కోనాపూర్ గ్రామానికి చెందిన క్వాలిస్ డ్రైవర్ మల్లేశం ఘటనా స్థలం వద్ద ఆగి ఇద్దరు డ్రైవర్ లను బయటకు తీసి తన క్వాలిస్ వాహనంలో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ తరలించారు.
Post Views: 343