తెలంగాణ రాష్ట్రంలోకరోనా వ్యాక్సిన్ పంపిణీకి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడతలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందికి ఇస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటికే 40,095 మంది ఉన్నట్లు గుర్తించారు.
PHC స్థాయిలో వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్ జిల్లాలో 146, రంగారెడ్డి జిల్లాలో 60 కేంద్రాలు గుర్తించి నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు