తెలంగాణ బీజేపీలో ఆధిపత్య రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీ మీద పట్టుకోసం బండి వర్గం – కిషన్ రెడ్డి వర్గం నువ్వా నేనా పావులు కదుపుతున్నారు. తెలంగాణ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోంది. మరోవైపు రాజా సింగ్ బండి సంజయ్ వర్గంలో చేరడంతో చలికాలంలో బీజేపీ కార్యకర్తల్లో వేడి రాజుకున్నట్లయింది.
మొత్తం మీద రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ – కిషన్ రెడ్డి వర్గాలుగా చీలిపోయారు. సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డికి పార్టీలో ఇప్పటికే పట్టు ఉండటంతో బండి సంజయ్ పట్టుపెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వికటించి పార్టీలో విభేదాలు కార్యకర్తలకే కాకుండా సామాన్య ప్రజలకు సైతం అర్థం అవుతున్నాయి.