క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకప్పుడు అలవాటు లేని పదం కానీ ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయింది. ముఖ్యంగా రెండేళ్ల కింద మీటూ ఉద్యమం జరిగినపుడు దేశవ్యాప్తంగా ఇది ట్రెండింగ్ అయింది. దానికి తోడు తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి కూడా నానా రచ్చ చేయడంతో అమ్మో అనుకున్నారంతా. అప్పట్నుంచి ఇప్పటి వరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ట్రెండ్ అవుతూనే ఉంది.
అవకాశం ఇవ్వాలంటే మాకు కావాల్సింది ఇవ్వాలంటూ హీరోయిన్లను వేధించే ప్రక్రియనే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. మాక్కావాల్సింది ఇచ్చి మీకు కావాల్సిన ఆఫర్స్ తీసుకోండి అంటూ కొందరు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా అమ్మాయిలను వేధిస్తుంటారు. అయితే దీని గురించి తాజాగాసీనియర్ నటీమణులు అన్నపూర్ణ, వై విజయ లాంటి వాళ్లు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. అయితే వాళ్లకు అప్పుడు ఈ పదం తెలియదు. వాళ్లకు తెలిసిన భాషలో వాళ్లు చెప్పారు. అప్పట్లో కూడా అమ్మాయిలను వేధించే వాళ్లు చాలా మంది ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేసింది అన్నపూర్ణ.
అంతదూరం ఎందుకు తాను 20ల్లోనే ఉన్నపుడే తల్లి వేషాలు వేయడానికి కారణం అదే అని.. సినిమాకు ముందుగానే ఎవడూ ఏం అడక్కూడదనే కమిట్మెంట్ తోనే షూటింగ్ కు వెళ్లేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది అన్నపూర్ణ. లేదంటే వాళ్లు వీళ్లు వచ్చి ఊరికే సతాయించే వాళ్లు అంటూ అలీతో సరదాగా షోలో చెప్పింది ఈమె.