పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాతృమూర్తి దాసరి మధురవ్వ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మధురవ్వ మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మధురవ్వ అంత్యక్రియలు స్వగ్రామమైన కాసులపల్లి లో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు.