తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వం చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత వెళ్తుండగా.. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న మహిళను చూసి చలించిపోయారు.
గాయాలతో స్పృహతప్పడి పడిపోయిన మహిళకు ఆమె తెలంగాణ జాగృతి మహిళా నేతలతో కలిసి సపర్యలు చేశారు. అనంతరం ఆమెను వెంటనే సదరు స్థానిక టీఆర్ఎస్ నాయకుల సహాయంతో మహిళను హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యసేవలు అందేలాచూడాలని ఆదేశించారు.