శ్రీ మురళి హీరోగా ఉగ్రం సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని కేజీఎఫ్ చిత్రం చేశాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసి ఈయన్ని పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మార్చేసింది. యష్ రేంజ్ కూడా మరింత పెరిగింది.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2చిత్ర షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మినహా అంతా అయిపోయింది. రీసెంట్‌గా షూటింగ్ అయిపోయిందంటూ టీంతో కలిసున్న ఫోటోను విడుదల చేసాడు ప్రశాంత్ నీల్.
కేజీఎఫ్ 2 కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 8 ఉదయం 10.18ని.లకు చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.
కేజీఎఫ్ 1 విడుదలైన డిసెంబర్ 21న పార్ట్ 2కు సంబంధించిన మేజర్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. కేజీఎఫ్ 2 మొత్తాన్ని 120 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. సమ్మర్ లో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.