దర్శక ధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహాబలేశ్వరం ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
వచ్చే ఏదా సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్‌లు విడుదల చేయగా, ఇవి యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నాయి.
రామరాజు ఫర్ భీమ్ పేరుతో ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో అయితే ఓ రేంజ్‌లో దుమ్ము రేపుతుంది. ఈ టీజర్ ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా కామెంట్స్‌ని దక్కించుకోగా, 3.5 కోట్లకు పైగా వ్యూస్, 12 లక్షల లైకులు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ఒక్క టీజర్ ఈ రేంజ్‌లో రచ్చ చేయడం చూస్తుంటే సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు. అలియా భట్, ఒలీవియో మోరిస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తుంది.