ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ట్వీట్టర్‌లో శుక్రవారం ఆయన స్వయంగా ప్రకటించారు.
ప్రస్తుతం తనకు కరోనా లక్షణాలేవి లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రావత్ కోరారు.
కొంతకాలం ఇంటి నుంచే పాలనా సంబంధమైన విషయాలను చక్కబెట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.