ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నుండి మొదలు పెడితే రానా, నితిన్, నిఖిల్, సుజీత్, కాజల్ అగర్వాల్, నిహారిక ఇలా పలువురు ప్రముఖులు వైవివాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ శ్రీజ గౌనితో ఏడడుగులు వేశాడు. ఈ పెళ్ళి వేడుకకు నివేదా థామస్, శ్రీ విష్ణు, మ్యాజిక్ కంపోజర్ వివేక్ సాగర్‌లు హాజరయ్యారు.
నివేధా థామస్.. వివేక్ ఆత్రేయ పెళ్లికి సంబంధించి పలు ఫొటోలు షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
వివేక్ కెరీర్ విషయానికి వస్తే బ్రోచెవారెవరురా చిత్రంతో పేరు ప్రఖ్యాతలు పొందిన వివేక్ ప్రస్తుతం నాని, మలయాళం నటి నజ్రియా నజీం ఫహద్ ప్రధాన పాత్రలలో అంటే సుందరానికి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నాని ప్రస్తుతం చేస్తున్న శ్యామ్ సింగం రాయ్ చిత్రీకరణ పూర్తైన తర్వాత మొదలు కానుంది.