తెలంగాణలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరింది. రాష్ర్టానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందించిన ప్రతిష్ఠాత్మక మిషన్‌భగీరథ పథకం మరో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రజలు తాగడానికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణను దేశంలోనే రెండోస్థానంలో నిలిపింది.
మిషన్ భగీరథ కారణంగా తెలంగాణలో 98.7 శాతం కుటుంబాలకు స్వచ్ఛమైన, శుద్ధిచేసిన మంచినీరు అందుతున్నది. 99.2 శాతంతో బీహార్ మనకంటే ముందున్నది.
తెలంగాణలో పట్టణప్రాంతాల్లో 99.4 శాతం, గ్రామాల్లో 98.4 శాతం కుటుంబాలకు మెరుగైన తాగునీరు అందుతున్నది. కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ దేశవ్యాప్తంగా 17 రాష్ర్టాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వేచేసి విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్‌సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) నివేదికలో తెలంగాణలో 98.7 శాతం కుటుంబాలకు శుద్ధమైన తాగునీరు అందుతున్నదని ధ్రువీకరించింది.