ప్రమాద వశాత్తు తాటిచెట్టుపై నుంచి పడిపోయి, ప్రాణా పాయం తప్పి తీవ్ర గాయాలై, నవడలేని పరిస్థితి నెలకొన్న గీతా కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు అండగా నిలిచారు.
సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో గురువారం ఉదయం జిల్లా పరిధిలో ప్రమాదంలో గాయపడిన గీతా కార్మిక కుటుంబాలకు ప్రమాదానికి గురై నడవలేని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి శాశ్వత ప్రాతిపదికన రూ.5లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో యుద్ధప్రాతిపదికన భీమా పొందేలా ముందుగా రూ.10వేల ఎక్స్ గ్రేషియా బీమా పొందడానికి ధృవీకరణ మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
ఈ మేరకు కొండపాక మండలం బందారం గ్రామ డి. మల్లేశంకు శాశ్వత ప్రాతిపదికన రూ.5లక్షల భీమా పత్రాన్ని అందించారు. అదే విధంగా మండల కేంద్రమైన మిరుదొడ్డి గ్రామ ముకుందం, చేర్యాల మండలం ఆకునూరు గ్రామ ఏం. కనకయ్య, సిద్ధిపేట అర్బన్ మండలం నర్సాపూర్ కు చెందిన కైలాశ్ గౌడ్, నారాయణ రావు పేట మండలం గుర్రాలగొంది గ్రామ పర్శరాములు, ఏం. చిన్న మల్లయ్యలకు యుద్ధప్రాతిపదికన రూ.10 వేల వరకూ వర్తించే భీమా పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.