హైదరాబాద్ ఐటీ సిగలో మరో చంద్రవంక చేరనున్నది. ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ ఫియట్ తన రెండో మజిలీగా హైదరాబాద్‌ను ఎంచుకొన్నది.
ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్ సగర్వంగా ప్రకటించింది.
150 మిలియన్ అమెరికన్ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్ గ్లోబల్ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ సెంటర్లో ఎఫ్సీఏకు ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నోవేషన్ ఇంజిన్‌గా గ్లోబల్ డిజిటల్ హబ్ సేవలు అందిస్తారు.