హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ.. ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్టార్ హీరోయిన్ సమంత చేస్తున్న ‘సామ్‌జామ్’ షోకి హాజరైంది. డైరెక్టర్ క్రిష్‌తో కలిసి ఆమె ఈ షోకి హాజరైంది.
ఈ షోలో సమంత చాలా స్ట్రాంగ్ క్వశ్చన్స్‌ని రకుల్‌పై సంధించింది. దీనికి ఎటువంటి తడబాటు లేకుండా ఆన్సర్ ఇచ్చేసింది రకుల్. ముఖ్యంగా.. ‘రకుల్.. నీపై బాగా రూమర్స్ వినిపిస్తుంటాయి.. నువ్వు మాత్రం స్పందించకుండా నీ పని నీవు చేసుకుంటూ ఉంటావు.. అదెలా సాధ్యమవుతుంది.. నేనైతే అసలు అలా ఉండలేను..’ అని సమంత అడిగిన ప్రశ్నకు.. రకుల్ ఫైరింగ్ ఆన్సర్ ఇచ్చింది.
”నిజమే.. నాపై రూమర్స్ బాగా వస్తున్నాయి. రూమర్స్ అని తెలిసినప్పుడు వాటిపై స్పందించడం దేనికి. అందుకే పట్టించుకోను. నాకెవరో హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చారనే రూమర్లు పుట్టించారు. నిజంగా నాకు ఎవరో ఇల్లు కొనిచ్చేట్లు అయితే.. నేనెందుకు వర్క్ చేయడం.
అలా రూమర్స్ పుట్టించేవారు.. మన గురించి అస్సలు పట్టించుకోరు. ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. అందుకే వాటిపై అస్సలు స్పందించను..” అని రకుల్ చెప్పుకొచ్చింది. ఇప్పుడీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.