టాలీవుడ్ క్రేజీ సింగర్స్లో ఒకరైన సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రీసెంట్గా సునీత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
సింగర్ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్, రామ్ల వివాహం డిసెంబర్ 27న జరగబోతోందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా వీరి వివాహం వాయిదా పడినట్లుగా వార్తలు వినవస్తున్నాయి.
కొన్ని కారణాల వల్ల వీరి వివాహం వాయిదా పడిందని, డిసెంబర్ 27న కాకుండా.. రాబోయే సంవత్సరంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.
వాయిదా పడటానికి కారణాలైతే తెలియరాలేదు కానీ.. నూతన సంవత్సరంలో మంచి ముహూర్తం చూసి.. సునీత, రామ్ల పెళ్లి జరపాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.