Home / HYDERBAAD / మెట్రో ప్రయాణం అద్భుతాల సమాహారం

మెట్రో ప్రయాణం అద్భుతాల సమాహారం

హైదరాబాద్ మహానగరంలో ప్రయాణమంటేనే నరకం. రోడ్డెక్కితే చాలు..ఇంటికి ఎప్పుడు చేరుతామన్న గ్యారంటీ లేదు. అడుగడుగునా ట్రాఫిక్‌ జామ్‌లు. సిగ్నళ్లు. అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరలేం. ట్రాఫిక్‌లో ఇబ్బందిపడుతూ ప్రయాణిస్తూ చాలామంది అలసటకు లోనవుతున్నారు. ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. నగరరోడ్లపై నిత్యం నరకయాతన అనుభవిస్తున్న హైదరాబాదీలు మెట్రో రాకతో జర్నీని ఎంజాయ్‌ చేస్తున్నారు. చింతలను దూరం చేసి..వింతలను పరిచయం చేస్తున్న మెట్రోలో మియాపూర్‌-ఎల్బీనగర్‌ వరకు ప్రయాణిస్తూ కొందరిని పలకరించగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ప్రయాణికుల అనుభవాలు, వారి అభిప్రాయాల కలబోతే ఈ కథనం.

ఉదయం 11 గంటలైంది. ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌లో రైలు ఆగింది. మియాపూర్‌ వెళదామని నేను, నా మిత్రుడు ఎస్క్‌లేటర్‌ ఎక్కి ప్లాట్‌ఫాంకు చేరుకున్నాం. చూస్తే పట్టుమని పదిమంది కూడా లేరు. ఇంతలో ఓ రైలు వచ్చింది..చూస్తుండగానే వెళ్లిపోయింది. నిమిషం వ్యవధిలోనే మరో రైలు వచ్చింది. మెట్రో బోగీలోకి ప్రవేశించగానే వేడిగా ఉంది. కరోనా కదా ఏసీ బంద్‌ చేశారనుకుంటా. చాలారోజుల తర్వాత మెట్రో ఎక్కిన నాకు టెన్షన్‌ పట్టుకుంది. చెమటలు పడుతున్నాయి. వెళ్లి ఓ పక్కాయన దగ్గర నిల్చున్నా.
మహిళల కోసం కేటాయించిన బోగీ కిటకిటలాడుతున్నది. మహిళల కోసం అని రాసి ఉన్నా పట్టింపులేకుండా కొందరు పురుషులు ఆక్రమించేశారు. మెట్రో అధికారి పండా శ్రీనివాస్‌ కల్పించుకొని పురుషులందర్నీ లేపి మహిళలకు సీట్లు ఇచ్చారు. మాస్క్‌లు లేని వారిని ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ఉద్యోగమంటేనే నైపుణ్యంతో కూడుకున్నది. శ్రద్ధ పెట్టి పనిచేయాలి. ఈ ట్రాఫిక్‌ చిరాకులో ఆలోచించే ఓపిక ఉండడం లేదు. అదే మెట్రో ఎక్కితే ప్రశాంతత, టెన్షన్‌ ఫ్రీ వాతావరణం. ఇంకేముంది ఆఫీసు తాలూకు ఆలోచనలు.ఇంటి తాలూకు పట్టింపులతో సుఖవంతమైన జర్నీ చేస్తున్నానని అన్నారు చైతన్య. ఖైరతాబాద్‌ నుంచి కూకట్‌పల్లి వరకు ప్రయాణిస్తానని చెప్పాడు.

మా ఆఫీసు ఖైరతాబాద్‌లో. ఇల్లు కూకట్‌పల్లిలో. రెండూ మెట్రోస్టేషన్లకు దగ్గరగా ఉన్నాయి. బండి పక్కనపెట్టి హాయిగా మెట్రోలో వెళ్లొస్తున్నానని చెప్పాడు జలమండలిలో పనిచేసే బాలస్వామి.

నిమిషాల్లోనే రైలు అమీర్‌పేటకు చేరుకుంది. హైటెక్‌సిటీ వెళ్లడానికి ఇక్కడ దిగండంటూ అనౌన్స్‌మెంట్‌ వస్తున్నది. చాలామంది ఎల్బీనగర్‌, మియాపూర్‌లలో ఎక్కి హైటెక్‌సిటీ రూట్లో వెళ్లాల్సినవాళ్లు తెలియక అమీర్‌పేటలో దిగకుండా కూకట్‌పల్లి, మియాపూర్‌ వరకు వెళ్లడం, తిరిగి తెలుసుకొని వెనక్కిరావడం సర్వసాధారణం. ఇప్పుడు చాలావరకు తగ్గినా మొదట్లో ఇలాంటివి చాలా జరిగేవట. కానిప్పుడు 90శాతం తగ్గాయని మెట్రోలో పనిచేసే ఉద్యోగి శ్రీనివాస్‌ చెప్పారు.
నిమిషమయ్యిందో లేదో ఎస్సార్‌నగర్‌కు చేరుకున్నాం. ఓ నడివయస్కురాలు పిల్లలతో సహా ఎక్కింది. పిల్లలు అస్సలు ఆగడం లేదు. అటు ఇటూ ఉరుకుతున్నారు. ఆమె అరుపులు, కేకలు బోగీలను సౌండ్‌ పొల్యూషన్‌ మయం చేశాయి. కొద్దిసేపటికి పిల్లలు గప్‌చుప్‌ అయ్యారు.

సాధారణంగానే సిగ్నళ్ల వద్ద రద్దీ ఉంటుంది. ఏ వీఐపీయో నగరానికి వస్తే గంటల తరబడి ఆగాల్సిందే. మెట్రోకు ఆ బాధ లేదు. తప్పిపోయి మనం ఆలస్యంగా వెళతామేమో కాని మెట్రో మాత్రం అరసెకను కూడా ఆలస్యంగా రాదు. మన మెట్రో ఆలస్యానికి ఆమడదూరం. ఎలాంటి ఇబ్బందిలేకుండా సమయానికి ఆఫీసుకు చేరుకుంటున్నానని అంటున్నారు శ్రీదేవి. తాను నిత్యం స్నేహితులతో కలిసి హబ్సిగూడ నుంచి ప్రయాణిస్తున్నానని చెప్పారు.

ఒకప్పుడు హైదరాబాద్‌కొచ్చిన చుట్టాలకు..చార్మినారో, హుస్సేన్‌సాగరో, గోల్కొండ కోటకో తీసుకెళ్లేవాళ్లేవారు. ఇప్పుడు మెట్రో ఎక్కించాల్సిందే. జహీరాబాద్‌ నుంచి వచ్చిన తమ బంధువులను మెట్రో ఎక్కించి సరదా తీర్చామని మియాపూర్‌లో ఉండే లక్ష్మీ వెల్లడించారు.

బాలానగర్‌కు చేరుకోగానే ఓ యంగ్‌ టీం ట్రైన్‌ ఎక్కారు. బోగీలోకి చేరుకోగానే తెగ మురిసిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్లు తీసి సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు తీసేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతలోనే ఓ పెద్దామె ‘బేటా మాస్క్‌లు పెట్టుకోండి’ అని గట్టిగా హెచ్చరించినంత పనిచేసింది.
ఇంటర్వ్యూకు వెళ్లాలంటే నీట్‌గా ఉండాలి. డ్రెస్‌ నలిగిపోకుండా, ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. బస్సుల్లో వెళితే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పడు హాయిగా మెట్రోలో ఇంటర్వ్యూకు వెళ్లొచ్చానని చెప్పాడు కూకట్‌పల్లికి చెందిన అజయ్‌.
టైమంతా రోడ్లమీదే గడిచిపోతున్నది.

పిల్లలకు టైం కేటాయించలేకపోతున్నాం. ఇవి ఉద్యోగం చేసే సగటు తల్లిదండ్రుల ఆలోచన, ఆవేదన. మెట్రో వల్ల త్వరగా ఆఫీసుకెళ్లి ఇంటికొస్తున్నానని, పిల్లలతో గడిపే సమయం దొరుకుతున్నదని అన్నారు అర్చన. కూకట్‌పల్లిలో ఓ ట్రావెలింగ్‌ కంపెనీలో పనిచేసే ఆమె నిత్యం హబ్సిగూడ నుంచి జేఎన్‌టీయూ వరకు మెట్రోలో ప్రయాణిస్తారు.
నగరంలో ఆటోవాలాల ఆగడాలు ఎక్కువ. మీటర్లు ఉన్నా పనిచేయవని చెప్పి అందినకాడికి దోచుకుంటారు. మెట్రో ప్రయాణం అలా కాదు నచ్చితే ఎక్కొచ్చు. సమయానికి వెళ్లిరావొచ్చు అన్నారు బీదర్‌ నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు మిత్రులు అభిషేక్‌, మనోజ్‌.

చివరి స్టేషన్‌ మియాపూర్‌లో దిగగానే దోతికట్టుకున్న కిష్టయ్య కనిపించాడు. ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తే..అప్జల్‌గంజ్‌కు వెళ్లాలని, ఫ్యాన్సీ స్టోర్‌కవసరమయ్యే సామగ్రి కొనుక్కొని తిరిగి వెళ్లిపోవాలని చెప్పాడు. బస్సులో అయితే లేటవుతుందని, అందుకే మెట్రో ఎక్కుతున్నానని చెప్పాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat