తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం మంత్రి పువ్వాడకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది.
తనను కలిసినవారు, తనతో వివిధ కార్యక్రమాల్లో సన్నిహితంగా మెలిగిన ప్రతిఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.