Home / MOVIES / వయస్సు గురించి పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు

వయస్సు గురించి పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు

కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే అవకాశాలు లభిస్తే ప్రయోగాత్మక పాత్రలతో ప్రతిభను చాటుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు నవతరం కథానాయికలు.

ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ ఆ దారిలో అడుగులు వేస్తోంది. కెరీర్‌ ఆరంభంలో గ్లామర్‌ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె కొంతకాలంగా మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిసారిస్తోంది. సినిమాల ఎంపికలో తన ఆలోచన విధానం మారడానికి గల కారణాల్ని పాయల్‌ రాజ్‌పుత్‌ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో హీరోలదే అధిపత్యం.

వారి ఇమేజ్‌లపైనే సినిమాలు ఆడుతుంటాయి. మేల్‌ డామినేషన్‌ ఇండస్ట్రీలో కథానాయిక ప్రధాన సినిమాలకు ఆదరణ తక్కువే. ఆ వాస్తవం అందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ పంథాలో మార్పులొస్తున్నాయి. మహిళల శక్తిసామర్థ్యాల్ని చాటిచెప్పే కథల్ని వెండితెరపై ఆవిష్కరించే ట్రెండ్‌ పెరిగింది. అలాంటి మంచి సినిమాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఫలితాన్ని పట్టించుకోకుండా మహిళా ప్రధాన చిత్రాల్లో భాగమవుతున్నా’ అని తెలిపింది.

వయసు అనేది తన దృష్టిలో ఓ నంబర్‌ మాత్రమేనని, నటనకు వయోభేదాలతో సంబంధం ఉండదని చెప్పింది. సీనియర్‌ హీరోలతో నటించడం వల్ల యువ హీరోల సరసన తెరపంచుకునే అవకాశాలు వస్తాయో, రావో అనే భయాలు తనలో ఎప్పుడూ లేవని చెబుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat