బరువు తగ్గేందుకు గ్రీన్ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్ టీ, గ్రీన్ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి.
బ్లాక్ టీ లో కంటే, గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పాలీఫినాల్స్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయి.
కాటెచిన్, ఎపికాటెచిన్, ఎపిగాలో కాటెచిన్ గాలెట్ అనే ఫ్లేవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్స్‌గా పని చేసి రోగనిరోధక వ్యవస్థ మెరుగవడానికి ఉపయోగపడతాయి. గ్రీన్ టీ ఉపయోగాలను పరిపూర్ణంగా పొందాలంటే దానిలో కెలోరీలను పెంచే తేనె, చక్కెర కలపకుండా తీసుకోవడం ఉత్తమం. అన్ని రకాల ఆహారం లానే గ్రీన్ టీ కూడా పరిమితికి మించి తీసుకుంటే మంచిది కాదు. రోజుకు నాలుగు కప్పులకు మించకుండా గ్రీన్ టీ తాగవచ్చు.