పార్టీ మార్పుపై సీనియర్ నేత, మాజీమంత్రి కె. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను కాంగ్రెస్ ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లా పరిగిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లంతా సమన్వయంతో కాంగ్రె్‌సను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై జానారెడ్డి సున్నితంగా స్పందించారు. అదంతా మీడియా ప్రచారమేనని వాఖ్యానించారు. ఎన్ని పార్టీలు పోటీ చేసినా నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.