ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు ఆయన కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది.
కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను శుక్రవారం, కేంద్ర పౌరవిమానయాన, హౌసింగ్‌శాఖల మంత్రి హర్దీప్‌సింగ్ పురిని శనివారం కలువనున్నట్టు సమాచారం.
ఈ ఇద్దరు మంత్రులతో భేటీకి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్టు తెలిసింది. వీరితోపాటు మరి కొంతమంది కేంద్ర మంత్రులతోనూ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఆదివారం ఆయన తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు.