దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత 30 వేల దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇది 6.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770కి చేరింది. ఇందులో 92,90,834 మంది బాధితులు కోలుకోగా, కరోనా బారినపడిన పడిన 3,63,749 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,42,186 మంది బాధితులు మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు మహమ్మారి వల్ల 414 మంది మృతిచెందగా, 37,528 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది.
దేశంలో అత్యధిక కరోనా కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 3824 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 18,68,172కు పెరిగింది. ఇందులో 73,001 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 17,47,199 మంది కోలుకున్నారు. మరో 47,972 మంది మరణించారు. అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.