Home / SLIDER / నేడు సిద్దిపేటకు సీఎం కేసీఆర్‌.

నేడు సిద్దిపేటకు సీఎం కేసీఆర్‌.

సీఎం కేసీఆర్‌ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.1200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మర్కూక్‌ మండలం ఎర్రవల్లి నుంచి సీఎం కేసీఆర్‌ బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.20 గంటలకు పొన్నాలలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11.40 గంటలకు మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఎన్సాన్‌పల్లిలో ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఈ దవాఖానను 960 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. అనంతరం 12.30 గంటలకు సిద్దిపేటలోని కోమటి చెరువు, నెక్లెస్‌ రోడ్డును పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 12.45 గంటలకు నర్సాపూర్‌లో డబల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఈ రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని  రూ.163 కోట్లతో నిర్మించారు. ఈ ప్రాంతానికి కేసీఆర్‌ నగర్‌ అని నామకరణం చేశారు. తొలి విడతలో 1,341 ఇళ్లు, రెండో విడుతలో వెయ్యి ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

మధ్యాహ్నం 1.20 గంటలకు చింతల్‌ చెరువు వద్ద తొలివిడత భూగర్భ మురుగుపారుదల వ్యవస్థను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.40 గంటలకు రంగనాయకసాగర్‌ అతిథిగృహాన్ని ప్రారంభించను న్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat