తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 643 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కు చేరింది. వైరస్ నుంచి తాజాగా 805 మంది కోలుకున్నారు..
ఇప్పటి వరకు 2,66,925 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 1482 మంది మృత్యువాతపడ్డారు. మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉండగా.. దేశంలో 1.5శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.
అలాగే రికవరీ రేటు 94.74శాతంగా ఉందని, జాతీయ సగటు 94.7శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7497 యాక్టివ్ కేసులున్నాయని, మరో 5434 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వివరించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 53,396 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 59,73,031 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది.