మరికాసేపట్లో శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర్శించి కోవిడ్ టీకాలపై చర్చించనున్నారు.
టీకాల తయారీపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ బృందాలు తిలకించనున్నాయి. టీకాల పురోగతిని తెలుసుకున్న అనంతరం శాస్ర్తవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాయబారులు, హైకమిషనర్లు ఢిల్లీ బయల్దేరనున్నారు.
విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
బయోలాజికల్– ఈ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్–1, 2 క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం గత నెలలో అనుమతి ఇచ్చింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చి భారత్ బయోటెక్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే.