తమిళనాడు రాజధాని చైన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తమిళ టీవీ నటి వీజే చిత్ర (28) ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సిరీస్‌లో ముల్లా పాత్రను పోషించి ఎంతో పేరు తెచ్చుకుంది. 2013 లో పీపుల్స్ టెలివిజన్‌లో వాట్ ది లా సేస్‌పై వ్యాఖ్యాతగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో కూడా నటించిన చిత్ర టీవీలో డాన్స్ షోలో రాణించింది. ఆమెకు డ్యాన్స్‌కు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆమె వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా గత ఆగస్టులో జరిగింది.
చిత్రను వివాహం చేసుకోబోయే వ్యక్తి పేరు హేమంత్ రవి. తన వివాహం త్వరలో జరగబోతోందని చెప్పిన చిత్ర, ఈ ఉదయం ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమాలను షాక్‌కు గురి చేసింది. ఆమె తన కాబోయే భర్తతో ఒక హోటల్ గదిలో ఉంటూనే షూటింగ్‌కు హాజరవుతోంది.
అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో షూటింగ్ నుంచి వచ్చిన చిత్ర ఆ తర్వాత స్నానానికి అని బాత్ రూమ్‌లోకి వెళ్లి ఎంత సేపటికి రాకపోవడంతో కాబోయే భర్త హేమంత్ హోటల్ సిబ్బంది నుంచి డూప్లీకేట్ కీ తీసుకొని తలుపులు తెరిచి చూడగా.. చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. షాక్‌కు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని, పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.