కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్‌లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రైతులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ కవిత.. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బ్లాక్ బెలూన్స్‌ను గాల్లోకి వదిలేశారు.