బాలీవుడ్లో కరోనా కల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవల జుగ్ జుగ్ జియో చిత్ర షూటింగ్లో పాల్గొన్న వరుణ్ ధావన్, నీతూ కపూర్, రాజ్ మెహతాలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మడు రాజ్‌కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘర్ నుండి ముంబై వచ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కృతి సనన్‌కు కరోనా పాజిటివ్ అని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం.మహేష్ బాబు నటించి 1 నేనొక్కడినే చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అమ్మడికి టాలీవుడ్లో ఆఫర్స్ కరువయ్యాయి.