వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన చివరి టీ20లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాకిచ్చింది. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుత బంతితో విధ్వంసక బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్(0)ను పెవిలియన్ పంపాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో సుందర్‌ను బౌలింగ్‌కు దింపాడు. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కు ఆవల విసరడంతో షాట్ ఆడిన ఫించ్ సర్కిల్‌లో హార్దిక్ పాండ్య చేతికి చిక్కాడు.
దీంతో 14 పరుగులకే ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లకు ఆసీస్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. ప్రస్తుతం మాథ్యూ వేడ్(32) దూకుడుగా ఆడుతుండగా స్టీవ్ స్మిత్(6) నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.