ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది.
టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్బిహారీ యాదవ్ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ అభ్యర్థులు, రెండింటిని స్వతంత్రులు తమ ఖాతాలో వేసుకున్నారు.