మెగా వారింట్లో పెళ్లి.. అక్కడున్నది మెగా డాటర్.. మరి వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నపుడు గిఫ్టులు ఎలా ఉంటాయి..? మన ఊహకైనా అందుతాయా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ కోటలో ఈమె పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతుంది. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబంలోకే తన తమ్ముడు కూతురును పంపిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే నిహా పెళ్లి కోసం మెగా కుటుంబ సభ్యులు భారీగానే ప్లాన్ చేస్తున్నారు. సంగీత్ కూడా గ్రాండ్ గానే జరగబోతుంది.
అందులో చిరంజీవి డాన్సులు కూడా ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. గతంలో కూడా మెగా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా కూడా అంతా కలిసి డాన్సులు చేయడం ఆనవాయితీగానే వస్తుంది. అప్పట్లో చిరు పెద్ద కూతురు సుష్మిత పెళ్లి వీడియో ఇప్పటికీ సంచలనమే. ఇక శ్రీజ పెళ్లిలో బాలీవుడ్ హీరోలు కూడా చిందులేసారు. ఇప్పుడు నిహారిక పెళ్లిని కూడా అంతే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్ళి కూతురుకు ఎవరికి తగ్గట్లు వాళ్లు భారీగానే గిఫ్టులు తీసుకొస్తున్నారు. తన తమ్ముడి కూతురు నిహారికకు చిరంజీవి ఏమిస్తున్నాడనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాగబాబును నాన్న అని.. చిరంజీవిని డాడీ అని పిలుస్తుంది ఈమె. అలాంటి కూతురు కోసం ఖరీదైన గిఫ్ట్ తీసుకొస్తున్నాడు మెగాస్టార్. నిహారిక కోసమే ప్రత్యేకంగా కోటిన్నర విలువ చేసే ఓ ఆభరణం సిద్ధం చేయించాడని తెలుస్తుంది. పెళ్లికి ముందుగానే తన కూతురుకు ఆ బహుమతిని అందచేసాడు చిరంజీవి. ఈయన ఇక్కడే ఉన్నా చిరు సతీమణి సురేఖ మాత్రం రాజస్థాన్ వెళ్లిపోయింది. అక్కడే పెళ్లికి కావాల్సిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది సురేఖ. మరోవైపు కూతురుకు మాత్రమే కాదు అల్లుడికి కూడా అదిరిపోయే బహుమతి ఇవ్వడానికి చిరు సిద్ధమయ్యాడు. ఏదేమైనా అక్కడున్నది మెగాస్టార్ కదా మరి.. ఆ మాత్రం హంగు ఆర్భాటం లేకపోతే ఎలా..?