టీఆర్ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్కు రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
థ్యాంక్యూ అన్నయ్య
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్కు ఎంపీ సంతోష్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా జీవితంలో మీరు నాకు అమూల్యమైన బహుమతి అన్నయ్య అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.