తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,73,341కు కరోనా కేసులు చేరగా 1,472 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,125 యాక్టివ్ కేసులు ఉండగా 2,63,744 మంది రికవరీ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 104 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.
