మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు.
సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. మొదట బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీని తీసుకోవాలనుకున్నారు.
అయితే ఆమె డేట్లు క్లాష్ కావొచ్చనే ఉద్దేశంతో రష్మికను సంప్రదించినట్టు సమాచారం. ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో రష్మిక షూటింగ్‌లో పాల్గొంటుందట.