తాజాగా వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. బీజేపీని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌కు చురకలంటిస్తూ ట్వీట్ చేసింది. గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో కంగన ట్వీట్ వైరల్‌గా మారింది. `ప్రియమైన కాంగ్రెస్.. మీ పార్టీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు `కంగన.. కంగన..` అంటూ నా నామజపం చేస్తూ గందరగోళం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం క్లిష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంటూ.. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంద`ని ట్వీట్ చేసింది.