Home / SLIDER / ఆశించిన ఫ‌లితం రాలేదు : మ‌ంత్రి కేటీఆర్

ఆశించిన ఫ‌లితం రాలేదు : మ‌ంత్రి కేటీఆర్

గ్రేటర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితం రాలేద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం వ‌చ్చిన స్థానాల‌కు అద‌నంగా మ‌రో 20 నుంచి 25 స్థానాలు వ‌స్తాయ‌ని ఆశించామ‌ని తెలిపారు.

ఎగ్జిట్ పోల్స్‌లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజ‌యం సాధిస్తుంద‌ని వెల్ల‌డి అయింది. 10 -15 స్థానాల్లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మి చెందామ‌ని పేర్కొన్నారు. బీఎన్ రెడ్డి కాల‌నీలో 18 ఓట్ల తేడాతో, మౌలాలిలో 200, అడిక్‌మెట్‌లో 200, మ‌ల్కాజ్‌గిరిలో 70 ఓట్ల స్వ‌ల్ప ఓట్ల తేడాతో త‌మ పార్టీ అభ్య‌ర్థులు ఓడిపోయార‌ని తెలిపారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించారు. ఫ‌లితాల‌పై స‌మీక్ష నిర్వ‌హించుకుంటాం.

ఓట‌రు మ‌హాశ‌యుల‌కు ధ‌న్య‌వాదాలు

టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓటు వేసి గెలిపించి ఆశీర్వ‌దించిన హైద‌రాబాద్ ఓటరు మ‌హావ‌యులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ద‌న్యావాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, సోష‌ల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పార్టీ అభ్య‌ర్థుల గెలుపు కోసం ప‌ని చేసిన సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ కు పేరుపేరునా పార్టీ త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat