Home / SLIDER / మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీనియర్‌ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1968లో కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌విప్‌గా పనిచేశారు. 1977లో వెంగళరావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు.

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన అయన 2014 ఎన్నికల్లో టికెట్‌ లభించకపోవడంతో బీజేపీలో చేరారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ సాయంత్రం మహబూబ్‌నగర్‌లో మహమ్మదాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat