సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోనే. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు.
ఎంతో మంది చిన్నారులకి గుండె ఆపరేషన్స్ చేయించి వారి పాలిట దేవుడిగా మారాడు. తాజాగాఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు.
ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధి వచ్చింది. దానికి ట్రీట్ మెంట్ కూడా ప్రారంభించారు. ఖర్చులన్నీ మహేష్ భరించగా, ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని.. ఆ చిన్నారికి, తన ఫ్యామిలీకి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈసందర్భంగా ట్వీట్ చేశారు.