‘ఎన్నో స్కీంలు.. మరెన్నో కట్టడాలు.. ఇంకెన్నో అద్భుతాలు.. ఈ ఆరున్నరేండ్ల తెలంగాణలో ఆవిష్కృతమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు.. కాస్మొపాలిటన్ నగరం అనువైన మౌలిక సదుపాయాలతో నగిషీలు దిద్దుకొన్నది. అభివృద్ధి గురించి మాటలు చెప్పడమే కాదు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించింది. ఒక్కసారి భాగ్యనగరాన్ని నలువైపులా వీక్షిస్తే చాలు అభివృద్ధి అంటే ఎంటో అవగతమవుతుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్‌లో ఆవిష్కృతమైన అద్భుతాల్లో కొన్ని… నమస్తే తెలంగాణ నుండి మీకోసం
దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్ట్రా డోస్డ్ కేబుల్ బ్రిడ్జి.
దీని పొడవు 233.85 మీటర్లు. పర్యాటకంగానూ ఎంతగానో ఆకట్టుకొంటుంది. జపాన్, చైనా తరహాలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు, రైల్వే బ్రిడ్జిలు, రోడ్డు అండర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టింది సర్కార్. రూ.8,410 కోట్లు ఈ పనులకు వెచ్చించింది. ఇప్పటికే 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 రోడ్లు-ఓవర్‌బ్రిడ్జిలు, ఒక కేబుల్ వంతెన అందుబాటులోకి వచ్చాయి.
టీఎస్ ఐపాస్…వ్యయం 2115.93 కోట్లు
- టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామికీకరణ అభివృద్ధి
- 9,500 పారిశ్రామిక యూనిట్లకు అనుమతి, అందులో 6,300 యూనిట్ల ఏర్పాటు
- విమానయాన హబ్‌గా హైదరాబాద్. టాటా బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, సీకోర్ స్కీం వంటి సంస్థల ఆపరేషన్స్ ప్రారంభం
- వరుసగా ఐదో సంవత్సరం ఉత్తమ నివాసయోగ్య నగరంగా హైదరాబాద్
టీ-హబ్ స్టార్టప్‌ల కోసం కేటాయింపు
- వినూత్న ఆవిష్కరణలు రూపుదిద్దుకునేందుకు వీలుగా ఏర్పాటు
- స్టార్టప్, ఎంట్రప్రెన్యూర్ సంస్థలను ఆకర్షించే లక్ష్యం
- ఇప్పటికే 1100కుపైగా స్టార్టప్‌ల అనుసంధానం
- 1500లకు పైగా ఉద్యోగాల కల్పన
టీఎస్‌ఐసీ (తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్)
- రాష్ట్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా గొప్ప చర్యలు
- ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం
- పాఠశాల స్థాయినుంచే ఆవిష్కరణలు పెంపొందించే సంస్కృతి
స్వచ్ఛ హైదరాబాద్ రూ. 1,716.33 కోట్లు
- 125 ఎకరాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో ఘనవ్యర్థాల డంపింగ్ యార్డ్ క్యాపింగ్
- పారిశుద్ధ్యం కోసం 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్ల ఏర్పాటు
- శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త సేకరణ
- ఘనవ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి
- డంపింగ్ యార్డు క్యాపింగ్
- మూడు వేల పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు
- ఘన వ్యర్థాలను సురక్షిత పద్ధతుల్లో తరలించే అత్యాధునిక వాహనాలు
శాంతిభద్రతలు – 1940.33 కోట్లు
- అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం
- 5 లక్షల సీసీ కెమెరాలు, హ్యక్ ఐ యాప్
- పోలీస్ గస్తీ బృందాల కోసం అధునాతన వాహనాలు
- ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ స్టేషన్లలో సదుపాయాల మెరుగు
- నేర ఛేదనలో తోడ్పడుతున్న అత్యుత్తమ నిఘా వ్యవస్థ
- నగరాన్ని అనుక్షణం కనిపెట్టుకునేలా ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ హబ్
- మహిళలు, చిన్నారుల రక్షణ కోసం షీటీంల ఏర్పాటు
- సైబర్ నేరాల నియంత్రణ, ఛేదనకు ప్రత్యేక వ్యవస్థ
పాదచారుల సౌకర్యాలు
- ఫుట్‌పాత్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌ల నిర్మాణం
- రోడ్లకు ఇరువైపులా 430 కి.మీ. మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం
- జాతీయ సగటు 0.52 కన్నా అధికంగా 0.68 ఫుట్‌పాత్‌ల ఏర్పాటు
- పాదచారుల కోసం 57 ఎఫ్‌వోబీలు ప్రతిపాదించగా, ఏడుచోట్ల నిర్మాణం
- వీధులను ఆధునీకరించి డిజైన్లలో మార్పులు చేయడం ద్వారా పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు అనువుగా ఉండేలా అవరోధాలు లేకుండా నిర్మాణం
- ఒక్కో జోన్‌లో 10 కి.మీ. మేర సైక్లింగ్ సదుపాయాల ఏర్పాటు
- వినూత్న రీతిలో 8 ప్రాంతాల్లో స్కైవాక్స్ నిర్మాణం
బస్తీ దవాఖానలు
- వ్యయం రూ. 30.51కోట్లు
- దేశంలోనే తొలిసారిగా అర్బన్ లోకల్ బాడీ కమ్యూనిటీ క్లినిక్‌ల ఏర్పాటు
- మెరుగైన వైద్యంకోసం ఆరోగ్య సంబంధిత వసతుల పెంపు
- మొత్తం 250 దవాఖానాల ఏర్పాటు
- ఒక్కో కేంద్రానికి రోజూ 85-100 మంది రోగుల సందర్శన
సాఫ్ట్ నెట్
- యువత అభిలాషకు అనుగుణంగా ఉండే ఎడ్యుకేషన్ చానల్
- సాఫ్ట్ నెట్ రెండు టీ-శాట్ చానళ్ల ప్రారంభం. టీశాట్ విద్య, టీశాట్ నిపుణ
- నిపుణులైన లెక్చరర్లు బోధించిన 900 గంటల క్లాసులు
- ఇంగ్లిష్ ఫర్ ఆల్ స్పెషల్ ప్రోగ్రాం, పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థల అనుబంధంతో ‘అవేర్‌నెస్ ఆన్ చైల్డ్’ అబ్యూజ్ కార్యక్రమం ఏర్పాటు
రిచ్(రిసెర్చ్, ఇన్నోవేషన్)
- ఆవిష్కర్తలను గుర్తించి మార్కెట్లకు అందించేందుకు రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) ఏర్పాటు
టీ-వర్క్స్
- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్ స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు టీ-వర్క్స్ ఏర్పాటు
వీ హబ్
- మహిళలను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు వీ-హబ్ ఏర్పాటు
- 3,427 మహిళా పారిశ్రామిక వేత్తలు
- 148 స్టార్టప్ ఇంక్యుబేటర్లు
- 12 స్టార్టప్ ప్రోగ్రామ్‌లు
- 320 ఉద్యోగాల కల్పన
- 36.2 కోట్ల నిధులు
టాస్క్
- స్కిల్స్, నాలెడ్జ్ ఉన్నవారికోసం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఏర్పాటు
- స్కిల్స్ సంపాదించేలా శిక్షణ ఇచ్చి, ఉద్యోగానికి అర్హులుగా తీర్చిదిద్దే అద్భుత కార్యక్రమం
ఎల్బీనగర్ జంక్షన్
కామినేని జంక్షన్
చింతలకుంట జంక్షన్
బైరామల్‌గూడ జంక్షన్
బహదూర్‌పుర జంక్షన్
బయోడైవర్శిటీ జంక్షన్
మైండ్‌స్పేస్ జంక్షన్
అయ్యప్ప సొసైటీ జంక్షన్
రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్
మేజర్ ప్రాజక్టులు-రూ. 14,738.55కోట్లు
– వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)
– నమూనా రహదారి కారిడార్లు, రహదారుల
అనుసంధానం (హెచ్‌ఆర్‌డీసీఎల్)
సమగ్ర సహదారి నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ)
హైవే ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ(హెచ్‌టీఎంసీ)
ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు (ఓఆర్‌ఆర్)
ఎస్‌ఆర్‌డీపీ ప్రణాళికలు
వ్యయం: రూ. 25,000కోట్లు
ప్రాజక్టు – పనులు – పొడవు (కి.మీ.లు)
స్కైవేలు – 7- 135
మేజర్ రోడ్లు – 11 – 166
మేజర్ రోడ్లు – 68 – 348
ఇతర రోడ్లు – 1400
గ్రేడ్ సెపరేటర్లు – 54
ఎస్‌ఆర్‌డీపీలో పూర్తయినవి రూ.8,410.00 కోట్లు. పూర్తయిన ప్రాజెక్టులు: ఫ్లై ఓవర్లు-9, అండర్‌పాస్‌లు-4, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు- 3, కేబుల్ బ్రిడ్జి-1.
సమగ్ర రోడ్ల నిర్వహణ
ప్రస్తుతం ప్రధాన రోడ్లను మాత్రమే సీఆర్‌ఎంపీ కింద చేపట్టగా, భవిష్యత్తులో ఇతర రోడ్లను కూడా ఇదే తరహాలో నిర్వహించాలని ప్రతిపాదన.
లింకురోడ్లు
ప్రతిపాదిత లింకురోడ్లు 137
గుర్తించినవి 126.2 కి.మీ.
వ్యయం 313.65 కోట్లు
పూర్తయినవి 44.7 కి.మీ.
పూర్తయినవి
- హెచ్‌టీ లైన్ – మియాపూర్- 1.00 కి.మీ.
- ఓల్డ్ ముంబై హైవే (లెదర్ పార్కు)- రోడ్ నెం-45 – 1.20 కి.మీ.లు
- ఓల్డ్ ముంబై హైవే -ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ వయా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ – 2.30 కి.మీ.
- ప్రశాసన్‌నగర్-జూబ్లీహిల్స్ రోడ్ నెం -78 – 0.47కి.మీ.
చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, సుందరీకరణ
- వ్యయం రూ.100 కోట్లు
- మొజంజాహీ మార్కెట్
- చార్మినార్ వద్ద చార్ కమాన్
- లాడ్ బజార్
- మహబూబ్ చౌక్ క్లాక్ టవర్
- షాలిబండ క్లాక్ టవర్
- పాత బ్రిటిష్ రెసిడెన్సీ
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
- వ్యయం 34.66 కోట్లు
- ఆతిథ్య గృహాలు (హోటల్స్, క్యాటరింగ్ యూనిట్ల ఏర్పాటు)
- రవాణా సౌకర్యం (గైడ్, ప్యాకేజీ టూర్స్)
- సౌండ్, లైట్ షోలు
- పర్యావరణ హిత టూరిజం
- సాంస్కృతిక కట్టడాల పునరుద్ధరణ
- కొత్త పర్యాటక ప్రాంతాల నిర్మాణం
క్రీడలు
- వ్యయం రూ.97.37 కోట్లు
- యువత క్రీడల్లో రాణించేందుకు వీలుగా మౌలిక సదుపాయాల కల్పన
- 21 ఆటలకు పాలకవర్గాల ఏర్పాటు
- ఏడుగురు కేర్ టేకర్స్
- 21 క్రీడా కేంద్రాల ఏర్పాటు
- ఏడు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు
మహిళలకు భద్రత
- మహిళలు,పిల్లల భద్రత,రక్షణకు వీలుగా పకడ్బందీ చర్యలు
- బాధిత ప్రజలకు చట్టబద్ధమైన మద్దతు ఇచ్చే భరోసా సెంటర్ ఏర్పాటు
- మహిళా ప్రయాణికుల కోసం షీ షటిల్స్ అందుబాటులోకి
- అత్యాధునిక సాంకేతికతతో రక్షణ వ్యవస్థ ఏర్పాటు
వైకుంఠ ధామాలు
- అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిపేందుకు చర్యలు
- వ్యయం- రూ.66.97కోట్లు
- నాలుగు విశాల శ్మశానవాటికల ఏర్పాటు
- మూడు సాధారణ శ్మశానవాటికల నిర్మాణం
- ఒక విద్యుత్ దహనవాటిక ఏర్పాటు
- స్టోర్‌రూమ్, అస్థికలకు లాకర్లు, పార్థివ దేహాలు భద్ర పరిచేందుకు శీతల గది, కార్ పార్కింగ్, వేడి నీళ్లతోకూడిన వాష్‌రూమ్స్, వైఫై, మార్చురీ వ్యాన్ తదితర సౌకర్యాలు
విపత్తు నిర్వహణ విభాగం…వ్యయం 15 కోట్లు
- దేశంలో విపత్తు నిర్వహణకు ప్రత్యేక విభాగాన్నిఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
- ఇటీవలి వరదలతో వేలాదిమందిని డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా తరలింపు
- వరదలు, నీరు నిలువ ఉన్నచోట తొలగించడం
- భవనాల శిథిలాలనుంచి బాధితులను కాపాడడం
- రోడ్డు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయ చర్యలు
- కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు నగరంలో
- నాలుగుసార్లు క్రిమిసంహారకాల పిచికారీ పనుల నిర్వహణ
హైదరాబాద్ సుందరీకరణ….
- అనేక ప్రాంతాల్లో వర్టికల్ గార్డెన్లు విస్తారంగా పెంచడం
- కూడళ్లలో ఫౌంటేన్ల ఏర్పాటు ద్వారా అందంతోపాటు చల్లని వాతావరణాన్ని కల్పించడం
- ఆయా ప్రాంతాల్లో ఒక్కో థీమ్‌తో శిల్పాల ఏర్పాటు
- ఫ్లై ఓవర్ల వద్ద, ఇతర వంతెనల గోడలపై పెయింటింగ్స్ వేయడం
- అత్యంత సుందరంగా నడకమార్గాల ఏర్పాటుతో ట్యాంక్‌బండ్ సుందరీకరణ
గ్రీన్ హైదరాబాద్ 332.70 కోట్లు
- అటవీ ప్రాంతాన్ని 24శాతం నుంచి 33శాతానికి పెంచాలనే లక్ష్యం
- ఆరేండ్లలో హెచ్‌ఎండీఏ పరిధిలో నాటిన మొక్కలు- 807లక్షలు
- జీహెచ్‌ఎంసీ పరిధిలో నాటిన మొక్కలు- 486లక్షలు
- 59 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు.
- ఓఆర్‌ఆర్ చుట్టూ పచ్చదనంతో బఫర్‌జోన్ ఏర్పాటు
- యాదాద్రి మోడల్ పద్ధతిలో నగరంలో 80 చోట్ల అడవుల పెంపకం.
పార్కులు, గార్డెన్‌లు వ్యయం: రూ.250 కోట్లు
- జీహెచ్‌ఎంసీ పరిధిలో 934 పార్కులు
- పౌరుల కోసం 460 ట్రీ పార్కులు
- రూ.134 కోట్లతో 58 థీమ్ పార్కులు
- 17 పంచతత్వ పార్కుల ఏర్పాటు
- టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహించేందుకు 500 నర్సరీలు
- మీర్-ఆలం పార్కు- మొఘల్ ఆర్ట్ థీమ్ పార్కు
- పంచతంత్ర పార్కు- పిల్లలకు నీతి సూత్రాలు, నైతిక విలువల బోధన కోసం
- డాగ్ పార్కు- పెట్స్ బిహేవియర్ లెర్నింగ్ కోసం
- బ్రెయిలీ పార్కు- దివ్యాంగుల కోసం
- పంచతత్వ పార్కు- ఔషధ వనం
- ప్లే పార్కులు- పిల్లలు ఆడుకోవడానికి
- ట్రాన్సిట్ పార్కు-ఫ్రూట్ థీమ్డ్ పార్కు
- వాటర్ హార్వెస్టింగ్ పార్కు- వర్షపునీటిని సంరక్షించేందుకు
మెట్రోరైలు
- మహిళలు,పిల్లల భద్రత,రక్షణకు వీలుగా పకడ్బందీ చర్యలు
- బాధిత ప్రజలకు చట్టబద్ధమైన మద్దతు ఇచ్చే భరోసా సెంటర్ ఏర్పాటు
- మహిళా ప్రయాణికుల కోసం షీ షటిల్స్ అందుబాటులోకి
- అత్యాధునిక సాంకేతికతతో రక్షణ వ్యవస్థ ఏర్పాటు
17,290.31 కోట్లు
కారిడార్ దూరం(కి.మీ) ప్రయాణ సమయం టైం
మియాపూర్-ఎల్బీనగర్ 29 45 1.46
జేబీఎస్-ఫలక్‌నుమా 15 22 1.10
నాగోల్-రాయదుర్గం 28 39 1.26
భవిష్యత్తు ప్రణాళిక…
రాయదుర్గం-శంషాబాద్
మెహిదీపట్నం- మియాపూర్-చందానగర్
రెండు పడక గదుల ఇండ్లు వ్యయం రూ.9,700 కోట్లు
- దేశంలోనే మొదటిసారి పేదల కోసం ఆత్మగౌరవ సౌధాలు
- 111చోట్ల లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం
- దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా కొల్లూరులో 124 ఎకరాల్లో 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం
- 20 శాతం కన్నా తక్కువ వైశాల్యంలోనే నిర్మాణం
- ప్రైవేటు డెవలపర్స్ సహకారంతో కొల్లూరులో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, బస్‌స్టేషన్లు
- అదనపు స్థలంలో ప్రైవేటు షాపుల ఏర్పాటు, నిర్వహణ
ఔటర్ రింగురోడ్డు
- 2014 నుంచి చేసిన వ్యయం- రూ.3,309.71 కోట్లు
- పటాన్‌చెరు-శంషాబాద్-హయత్‌నగర్-మేడ్చల్‌ను కలుపుతూ 158 కి.మీ. పొడవైన రింగురోడ్డు
- సెంట్రల్ మీడియన్‌లతో కూడిన 8 లేన్ల రోడ్డు, 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు
- ఔటర్‌కు వెలుపల వేరువేరు దారులను కలుపుతూ రెండువైపులా సర్వీసు రోడ్డు
- వాహనాలు ఆగే పనిలేకుండా 19 ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఆటోమెటిక్ టోల్ బూత్
- 158 కి.మీలలో 24 కి.మీ. మేర ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు. మిగిలిన 138కి.మీ. మేర పనులు కొనసాగుతున్నాయి.
బ్రాండ్ హైదరాబాద్ 1,96,404 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ
- పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన
- 8.50 లక్షల ఉద్యోగాల కల్పన
- 2014 నుంచి శరవేగంగా ఐటీ రంగ అభివృద్ధి
- 2020లో జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధి నమోదు
- స్టార్టప్ హబ్‌లకు కేంద్రంగా హైదరాబాద్
- ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీలకు రెండో ఇల్లుగా హైదరాబాద్
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఘనమైన రికార్డు
- రాష్ట్రంలో చేపట్టిన పలు పాలసీలు దేశంలోనే రోల్ మోడల్‌గా మారాయి
తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి
- 2014నుంచి ఇప్పటిదాక 4,727 కి.మీ. పొడవున నీటి పైప్‌లైన్ల ఏర్పాటు
- వీటికి అయిన వ్యయం రూ.14,175.30 కోట్లు
- అందరికీ స్వచ్ఛమైన మంచినీటి సరఫరా
- ఎండకాలంలోనూ కొరతలేకుండా నీటి సరఫరా
- దేశంలోనే నగర ప్రజలకు సరిపడా మంచినీటిని అందిస్తున్న ఏకైక నగరం
- 400 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)ల నీటినిల్వ సామర్థ్యంలో ఔటర్ వెలుపలి గ్రామాల కోసం 230 జలాశయాల నిర్మాణం
- మెట్రో నగరాల్లో అత్యధికంగా 25 శుద్ధి కేంద్రాల ద్వారా రోజుకు 772 ఎంఎల్‌డీల వ్యర్థ జలాల శుద్ధి
అన్నపూర్ణ క్యాంటీన్లు వ్యయం రూ.152.03 కోట్లు
- రూ.5కే రుచికరమైన భోజనం
- నగరవ్యాప్తంగా 150 కేంద్రాల ద్వారా రోజూ 40 వేల మందికి భోజనాలు
- దేశంలోనే అతిపెద్ద స్టేట్ లెవల్ ఫుడ్ సెక్యూరిటీ ఇంటర్వెన్షన్ ఏర్పాటు
- లాక్‌డౌన్ సందర్భంగా ఉచితంగా భోజనాల అందజేత
- ప్రస్తుతం 350సెంటర్లలో నడుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లు
చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ
- వ్యయం రూ.376.80 కోట్లు
- నీటి పునరుద్ధరణ, అర్బన్ లేక్స్ అభివృద్ధి
- చెరువు గట్ల సామర్థ్యం పెంపు
- ఐలాండ్, సిల్ట్ ట్రాప్ వంటివి ఏర్పాటు
నిరంతర విద్యుత్ సరఫరా…
- వ్యయం: 2,374.36 కోట్లు
- గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా
- విద్యుత్ కొరతను అధిగమించేందుకు సూక్ష్మ, మధ్య, దీర్ఘ ప్రణాళికల అమలు
- వీధుల్లో, జిల్లా రహదారులు, హైవేలపై రూ.564 కోట్లతో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు
- ఎల్‌ఈడీ లైట్లు బిగించిన తరువాత 87,36,123యూనిట్ల విద్యుత్ ఆదా
- 2,73,176 టన్నుల కర్బన ఉద్గారాల తరుగుదల
అభాగ్యులకు అండ
గ్రేటర్‌లోని 13 షెల్టర్ల ద్వారా వేలమందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వీటిలో ఆరు షెల్టర్లు బస్తీ దవాఖానలకు దగ్గరగా ఉన్నాయి. షెల్టర్‌లో ఆహ్లాదం కోసం కలర్ టీవీ, కంప్యూటర్ సౌకర్యాన్ని కల్పించారు.వారి రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకొన్నారు. బయోమెట్రిక్, ఫేస్ డిటెక్టింగ్ డివైజెస్ లాకర్లను ఏర్పాటుచేశారు. నాలుగు షెల్టర్ హోంలను ప్రత్యేకంగా మహిళల కోసం అందుబాటులోకి తెచ్చారు. ప్రతి హోం నిర్వహణకోసం ఏడాదికి 2.08 లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు.
- నగరంలో బిజీగా తిరుగుతున్నప్పుడు ఆకలిగా అనిపిస్తే రూ.5 కే అన్నం దొరుకుతుంది. ఇది అన్నపూర్ణ.
- సుస్తీగా ఉంటే ఉచితంగానే అత్యాధునిక వైద్యం లభిస్తుంది. ఇది బస్తీ దవాఖాన
- సిటీకి వచ్చినంక.. ఎక్కడ ఉండాలో తెలియనివారికి ఉచితంగా ఆశ్రయం లభిస్తుంది. – ఇది నైట్ షెల్టర్.
- సందడిగా గడపడానికి చుట్టూ ఎన్నో ఆహ్లాదకర ప్రాంతాలు..ఇది చెరువులు, పార్కుల సుందరీకరణ ఫలితం.
- మహిళలతో అసభ్యంగా వ్యవహరిస్తే తాటతీసేందుకు సిద్ధం.. ఇవి షీటీమ్‌లు
- అనుకోని ఆపద వస్తే ఆదుకొనేందుకు పకడ్బందీ రక్షక వ్యవస్థ. – ఇది డిజాస్టర్ మేనేజ్‌మెంట్.
- వ్యాపారాలకు అనువైన నగరం.. ఇది ఐటీ అడ్డా..