మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా మంచు లక్ష్మీ అందరికీ పరిచయమే. మోహన్ బాబు నటవారసురాలిగా నటిగా తనని తాను నిరూపించుకున్న మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా ఇలా అనేక రంగాల్లో దూసుకుపోతోంది.
అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అది అలాంటిలాంటి విషయం కాదు. తన లవ్‌కి సంబంధించిన మ్యాటర్‌ని ఆమె రివీల్ చేశారు. ఓ స్టార్ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎంతగానో బాధపడ్డారట. ఏడ్చేశారట. ఆ హీరో అంటే అంత ఇష్టం పెంచుకున్న మంచు లక్ష్మీ.. అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఆయనకి పెళ్లి అయ్యేటప్పుడు ఏడ్చేసిందట.. అంతగా ఆమిర్‌ని మంచు లక్ష్మీ ఇష్టపడిందట. ఆమిర్ ఖాన్ రెండో సారి పెళ్లి చేసుకునే సమయంలో కూడా మంచు లక్ష్మీ ఏడ్చేసిందట.
ఆయన సినిమాలు సెలక్ట్ చేసుకునే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుందని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున అంటే కూడా అంతే ఇష్టమని తెలిపిందీ అమ్మడు.