తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,69,223కు చేరింది.
1,455 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 10,490 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,57,278 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
ఇప్పటి వరకు తెలంగాణలో 53,32,150 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 131, రంగారెడ్డి జిల్లాలో 58 కరోనా కేసులు నమోదయ్యాయి.