నీరంగంలో అడుగుపెట్టే ప్రతి కథానాయిక అగ్ర స్థానానికి చేరుకోవాలని తపిస్తుంటుంది. వృత్తిపరమైన పోటీని తట్టుకొని తారాపథంలో దూసుకుపోవడం అంత సులభం కాదు. అయితే తన విషయంలో మాత్రం అంతా అనుకున్నట్లుగానే జరుగుతోందని, కెరీర్ ఆరంభంలో కన్న కలలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది.
మంగళూరు సోయగం పూజాహెగ్డే. ‘ప్రస్తుతం వృత్తిపరంగా చాలా సంతోషంగా ఉన్నా. నేను కోరుకున్న అవకాశాలు లభిస్తున్నాయి. నేను అభిమానించే హీరోలతో సినిమాలు చేసే అదృష్టం దక్కింది. మనసులో బలమైన ఆకాంక్ష, కష్టపడేతత్వం ఉంటే స్వప్నాలన్నీ సాకారమవుతాయనే నమ్మకం పెరిగింది.
నా శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతున్నా’ అని పూజాహెగ్డే పేర్కొంది. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమతోనే పాన్ ఇండియా కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నానని, భవిష్యత్తులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మరింత కష్టపడి పనిచేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.