గడచిన ఆరేళ్ళ కాలలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృది గతంలో ఎప్పుదూ జరగలేదని, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువలో నిలిపిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అయన బౌద్ధనగర్ లో విస్తృతంగా పర్యటించారు. వివిధ బస్తిల్లో శ్రీ పద్మారావుకు స్థానికులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు బాసటగా నిలిచిందని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ది లో అగ్ర స్థానంలో నిలిపామని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని పనులను చేపట్టామన్నారు. వ్యక్తిగత ప్రయోజన సంక్షేమ పధకాలతో పాటు అణగారిన కులాల అభున్నతికి పాటుపడుతున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో దాదాపు 16 వేల మందికి ఆసరా పించన్లు చెల్లిస్తున్నామని, ప్రతి నెల కేవలం బౌద్ధానగర్ డివిజన్లోనే 42 వందల మంది పించన్లు పొందుతున్నారని తెలిపారు.
వందల మందికి కళ్యాణ లస్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా bonalu పండుగకు ఆలయాలకు చెక్కులను అందించి ప్రత్యెక నిధులను పంపిణి చేసే పద్ధతిని కెసిఆర్ ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. 175 దేవాలయాలకు నిధులను అందించామని, రంజాన్, క్రిస్మస్ కానుకలను కూడా రికార్డు సంఖ్యలో లబ్దిదారులకు సికింద్రాబాద్ పరిధిలో అందించామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో, వరదల వల్ల ఇబ్బందులు తలెత్తిన రోజుల్లో సైతం తమ ప్రభుత్వం, తాము వ్యక్తిగతంగా ఆదుకున్నామని తెలిపారు. బౌద్దనగర్ అభ్యర్ధి శ్రీమతి కంది శైలజ, డివిజన్ ఇంచార్జ్, మాజీ మంత్రి శ్రీ ఫరిదుద్దిన్, జనగామ జెడ్ పీ చైర్మన్ శ్రీ సంపత్ రెడ్డి, తెరాస యువనాయకులూ తెగుల్ల కిరణ్ కుమార్ గౌడ్ తెరాస సీనియర్ నాయకులు, స్థానిక సంఘాల ప్రతినిధులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు