కరోనాతో కుదేలై ఆర్దికంగా నష్టపోయిన సినిమా రంగంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ నగరం సినిమా పరిశ్రమ, చిత్ర నిర్మాణ రంగానికి దేశంలోనే పెట్టింది పేరు.
చితికిపోయిన పరిశ్రమను పునరుజ్జీవింపచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థలతో పాటు ఉండే హెచ్ టీ, ఎల్టీ కేటగిరి కనెక్షన్స్‌కు సంబంధించి విద్యుత్ కనీస డిమాండ్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేస్తుంది అని కేసీఆర్ తెలిపారు.
– రాష్ట్రంలో 10 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌ను సహాయంగా అందించి చితన్న పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
– రాష్ట్రంలోని అన్ని రకాల సినిమా థియేటర్స్‌లో ప్రదర్శనలను (షోలను) పెంచుకునేందుకు అనుమతి ఇస్తాం. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటును కల్పిస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.