తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ హితవు పలికారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”సుచిత్ర కృష్ణంరాజు దగ్గరికిపోతే ఆయన ఒక ముచ్చట చెప్పిండు. ‘ఉత్తరప్రదేశ్ సీఎస్‌తో ఏదో పనిఉండి పోతే. పని సంగతి తరువాత గని మా దగ్గర నోయిడా, ఘజియాబాద్ వంటి పారిశ్రామిక పట్టణాలున్నా మాకు పెట్టుబడులు వస్తలేవు. మరి హైదరాబాద్‌కు ఎట్లా వస్తున్నయి.
ఎందుకొస్తున్నవి’ అని అడిగిండట. అప్పుడాయన మా తెలంగాణలో దమ్మున్న ముఖ్యమంత్రి ఉన్నడు. కేసీఆర్ ఉన్నడు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పిండు. పనికిమాలిన పంచాయతీల్లేవు. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి అని ఆయన సమాధానం చెప్పారట. హైదరాబాద్ బాగుంటెనే తెలంగాణ బాగుంటుంది. తెలంగాణ భవిష్యత్తు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నది. రైతుబంధు, రైతు బీమా సహ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేయాలంటే హైదరాబాద్ బాగుండాలి.
పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి. హైదరాబాద్ నగరంలో జీవో నెంబర్ 58, 59 కింద పేద వారికి లక్ష పట్టాలు పంపిణీచేశాం. మోడల్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు కట్టుకొన్నాం. మల్టీపర్పస్ కాంప్లెక్స్‌లు కట్టుకొన్నాం. బ్రహ్మాండంగా ైఫ్లై ఓవర్లు కట్టుకొన్నాం. అండర్‌పాస్‌లు, బై పాస్‌లు కట్టుకొన్నాం. 135 లింకు రోడ్లు ఏర్పాటుచేసుకొన్నాం. మనంచేసిన అభివృద్ధిని చెప్పుకొంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చు” అని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సూచించారు.