Home / MOVIES / సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రావణలంక’

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రావణలంక’

క్రైమ్‌, రొమాన్స్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు మరో సినిమా వచ్చేసింది. పెద్ద సినిమాకు ఏమాత్రం తగ్గకుండా రూపొందించిన ‘రావణలంక’ సినిమా టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా ఎలా ఉందో.. ఎలా తీశారో చూద్దాం.

మరి సినిమా ఎలా ఉందో చూద్దాం విభిన్నాంశాన్నిశుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లకు పండుగ రోజే. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. టాకీస్‌లోకి సినిమాల విడుదల మొదలైంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘రావణలంక’. విభిన్న కథాంశంతో రూపొందించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్‌లలో విడుదలైంది. ఈ చిత్రంతో సినీ పరిశ్రమకు మరికొంతమంది ప్రతిభ గలవారు పరిచయమయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆసక్తి రేపింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ ఏమిటంటే: నలుగురితో కూడిన స్నేహబృందం గోవాకు వెళ్తారు. ఆ పర్యటనలో హఠాత్తుగా వారిలో ఒకరు శవమైతేలుతారు. అతడి మృతితో ఏం చేయాలో తెలియక మిగతా వారు భయాందోళనతో ఉంటారు. అయితే ఇదే సమయంలో విఘ్నేశ్‌ (క్రిష్‌) లవర్‌ శ్రావణి (అష్మిత కౌర్‌) కనిపించకుండాపోతుంది. శ్రావణి అదృశ్యానికి.. ఆ చనిపోయిన సంఘటనకు ఉన్న లింక్‌ ఏమిటనేది సినిమాలో మిగతా కథాంశం. తన లవర్‌ ఆచూకీ కోసం విఘ్నేశ్‌ ఏం చేశాడు? వీటి మధ్యలో డ్రగ్స్‌, అమ్మాయిల దందా వ్యవహారం ఏమిటి? అనేవి ఆసక్తికరం. మురళీశర్మ, దేవ్‌గిల్‌ ఆ మిస్టరీని ఎలా ఛేదించారనేది సినిమా చూడాల్సిందే.

తెరకెక్కించిన విధానం: విశృంఖలం దాటుతున్న నేరాలు, డ్రగ్స్‌ వ్యవహారం యువతను తప్పుదోవ ఎలా పట్టిస్తుందో.. ఎంతటి దారుణ పరిస్థితులకు దారి తీస్తుందో దర్శకుడు రాజు తెరకెక్కించాడు. ఎంజాయ్‌మెంట్‌ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో కళ్లకు కట్టినట్టు చూపించారు. బీఎస్‌ఎన్‌ రాజు దర్శకత్వ బాధ్యతలకు న్యాయం చేశాడు. ఎక్కడా కూడా కొత్త దర్శకుడి సినిమా మాదిరి అనిపించదు. డ్రగ్స్‌, అమ్మాయిల సరఫరా వంటి అంశాలను స్పృశిస్తూనే ప్రస్తుత సమాజ ధోరణిని వివరించాడు. ఇంకాస్త మెరుగుపరిస్తే దర్శకుడిగా రాజు నిలదొక్కుకోవచ్చు. నిర్మాణపరంగా ఉన్నతంగా ఉంది. క్రిష్‌ ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదని సినిమాను చూస్తే అర్థం అవుతుంది. ఎడిటింగ్‌, డబ్బింగ్‌ విషయంలో కొంత ఇబ్బందిగా ఉంది.

నటన: నిర్మాత కమ్‌ హీరో క్రిష్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో పాత్రకు న్యాయం చేశాడు. ఫైట్స్‌లోనూ అదరగొట్టాడు. అష్మిత కౌర్‌ శ్రావణి పాత్రలో అందచందాలతో ప్రేక్షకులను కవ్వించింది. ప్రముఖ నటులు మురళీ శర్మ, దేవ్‌గిల్‌ తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు. రచ్చ రవి నవ్వించాడు. ఉజ్జల్‌ కుమార్‌ సంగీతం చిత్రానికి ప్లస్సయ్యింది. ‘అరెరె అరెరె’ పాటతో రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ‘సృజన ఇన్నవా’ ప్రేక్షకుల నోళ్లల్లో కొన్నాళ్లు నానుతుంది.

నటీనటులు: క్రిష్‌ బండిపల్లి, అష్మిత కౌర్‌ బక్షి, మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్‌
దర్శకుడు: బీఎస్‌ఎన్‌ రాజు
నిర్మాత: క్రిష్‌ బండిపల్లి
సంగీతం: ఉజ్జల్‌ కుమార్‌ సాహ

రేటింగ్‌: 3/5

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat